"తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది!
తెలంగాణ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, రాయలసీమ నాది!
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదే రా!"-

అన్న సి.నా.రె మాటలు అక్షర లక్షలు.

"తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకండ
యెల్లవారు వినగ యెరుగవే బాసాడి
దేశ భాష లందు తెలుగు లెస్స"-

అన్న శ్రీ కృష్ణదేవరాయల వారి పలుకులు అక్షర సత్యాలు.

మా తెలుగు తల్లికి మల్లె పూదండ! మముగన్న తల్లికీ మంగళారతులు!

-- జై తెలుగు తల్లీ!

ఈ webzine మూడు ఆశయాల్తో ప్రారంభించాం.

  • మొదటిది భారతదేశం బయట ఉంటున్న తెలుగు వారి జీవన విధానాల్ని,అనుభవాల్ని ప్రతిబింబించే రచనలకి, వాటి రచయత(త్రు)లకి ఒక వేదిక కల్పించటం.
  • రెండోది ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండేట్టు చూడటం.
  • మూడోది Internet technology ని వీలైనన్ని విధాల ఉపయోగించుకుంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వారందరికీ తేలిక మార్గంలో అందేట్టు చూడటం.

నేనొక దుర్గం...
నాదొక స్వర్గం...
అనర్గళం... అనితరసాధ్యం... నా మార్గం...
జయభేరి...శ్రీశ్రీ

నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి అహుతిచ్హాను
నేను సైతం
విశ్వవ్రుష్టికి
అశ్రువొక్కటి ధారపొశాను......
మహాప్రస్థానం...శ్రీశ్రీ
పతితులార!
భ్రష్టులార!
ఇది సవనం,
ఇది సమరం!
ఈ యెగిరిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట,
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్ర్యం,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళులేచి,
జనావళికి శుభం పూచి-
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది! 

ఈ స్వర్గం ఋజువవుతుంది!

పతితులార!

భ్రష్టులార!     

బాధాసర్పదష్టులార!

దగాపడిన తమ్ములార!ఏడవకం డేడవకండి! 

వచ్చేశాయ్, విచ్చేశాయ్, 
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్,
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రాల్,
రారండో! రండో! రండి!
ఈలోకం మీదేనండి!

 

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోతాను

నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను 

నేను సైతం ప్రపంచాద్యపు తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను.

సకల జగతిని శాస్వతమ్గా వసంతం వరియించుదాక
ప్రతి మనిశికి జీవనంలో నందనం వికసించుదాక
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను

           **మహా కవి శ్రీ శ్రీ గారికి జోహార్లు అర్పించుచూ...............


 
పాఠకప్రీయుల  తెలుగు కవితల కోసం  క్రింది లింక్  పైన  క్లిక్ చేయండి.

http://eemaata.com/em/

 http://www.maatelugu.com/index.php

 

 

 

రాయి
- కె.ఎస్‌. అనంతాచార్య

మనుషులు అమెరికాకు

పక్షులు సైబేరియాకు

బండలు పట్నాలకు

వలసలు, వలసలు, వలసలు !!

సంపాదనకైతేనేం

ఆహార సంపాదనకైతేనేం

వ్యాపారానికైతేనేం

ఆగడం లేదు వలసలు !!

నాగరికతకు శ్రీకారం చుట్టింది రాళ్ళు


రాజకీయనాయకులకు పునాదిరాళ్ళు

పోయినవారి తీపిగుర్తులు సమాధిరాళ్ళు

ఇప్పుడు ఆనవాళ్ళు కోల్పోతున్న రాళ్ళు !!

రాముని పాదం తాకిన రాయి

వనితగా మారింది

ఆధునికుడి కన్నుపడి

రాళ్ళు క్వారీ పరిశ్రమలవుతున్నాయి !!

రాళ్ళు రాపిడి పెడ్తే

నిప్పును ఆందించాయి

ఆ రాళ్ళ కడుపుకే చిచ్చుపెట్టి

గుట్టల్ని కంకర కుప్పల్ని చేస్తున్నాం !!

తాజ్‌మహల్‌ రాయే

అజంతా శిల్పం రాయే

అలాంటి రాయి జాతి నశిస్తే

మన అస్తిత్వం ???

కొండల్ని రక్షించుకోవడం కొరకే

వెంకటేశ్వరుడు కొండల నెక్కింది

ఆ కొండల కొమ్ములనే కదా

మనం నరికేది !!

రాయి విలువ తెలిసే కదా

నర్సింహుడు గుట్టల నేలితే

రాళ్ళ గుండెల్లో గునపాల్ని దించి

మనది ‘రాతి గుండె’ అయ్యింది !!


ఊరు పదిలమని దేవతలు

గుట్టలు, కొండల నెక్కితే

జేబు బరువు కోసం

రాళ్ళను సైజుల వారీ కత్తిరింపు, తరలింపు !!!

కోహినూరు రాయే

కోవెల నిర్మాణానికీ రాయే

గుడిలో దేవుడు రాయే

రాళ్ళల్లో రాయైన రాయి

మనిషికన్నా చాలా నయం !!


గ్యాస్‌ స్టౌవ్‌కి మూలం పొయ్యిరాయి

చరిత్రకాధారం శాసనం రాయి

రాళ్ళ వలసలు ఆపకుంటే

వచ్చేతరం నోట్లో రాయి కూడా మిగలదు