మనబడి
Home గ్రామ చరిత్ర పాడిపంటలు గ్రామకబుర్లు రచ్చబండ Photo Gallery about us మన NRI's మాఊరి ప్రముఖులు మన సంస్కృతి కవితా సంపుటి వసతి సౌకర్యాలు Contact Us
ఎందరో మహానుబావులును,విద్యావంతులను,గవెర్నమెంట్ ఆఫిసర్స్ను,ఇంజనీర్సును,డాక్టార్సును,కళాకారులను,రాజకీయనాయకులను క్రీడాకారులను అందించిన ఘనత మన స్కూలు .శ్రీ మాకినేని రామయ్య జిల్లా పరిషత్ స్కూలు. 1950 లో, శ్రీ మాకినేని యాకయ్య గారి కుమారుడు శ్రీ మాకినేని రామయ్య గారు ఎంతో ముందుచూపుతో,ఉడరస్వబావముతో,తన ఆస్తిని ఖర్చుచేసి నిర్మించారు.ఆ రోజులలో ఒక్క పెదనందిపాడు లో మాత్రమే స్కూలు ఉన్నది వెళ్ళాలంటే 8 కి.మీ. కాలి నడకన నడుస్తూ,3 వాగులు దాటి వెళ్ళాలి.స్కూలు కి స్థలమును దానం చేసిన దాత శ్రీ మాకినేని సుబ్బారాయుడు గారి కుమారుడు శ్రీ మాకినేని వీరయ్య గారు. ఆ రోజులలో కొప్పర్రు,అన్నపార్రు,గొట్టిపాడు,గనికపుడి,గొరిజవొలుగుంటపాలెం,రావిపాడు,గోగులముడి,వంగిపురం,మేడారిపాలెం మొదలగు గ్రామాలనుండి విద్యార్డులు వచ్చేవారు. వారి బోజానాలకు వసతీ గృహం కూడా కట్టించిరి. గుంటూరు నుండి పెదనందిపాడు మైన్రోడు మీదనే ఒకవైపు స్కూలు, మరోవైపు 3 ఎకరముల సువిశాలమైన గ్రాండ్,ధానికీ ఆవలగా పెద్ద చెరువు, గ్రౌండ్ లో పెద్ద పెద్ద వేపచెట్టులు,చింత చెట్లు, వెలగచెట్టు,నంది విగ్రహాలు,ఇసుకదిబ్బా,నర్సు బిల్డింగ్,స్టేజి,వాలీబాల్ కోర్ట్ మొదలగునవి ఉన్నవి.ఈసుక లో ఆలింకు ఆట, పెద్ద తూము లో దొర్లిగింతలు,కభాడి, వంగులు దూకులు, బ్యాట్మింట్ బాల్,సాఫ్ట్ బాలు,పిచ్చి బంతి,కుక్కల పీకుల్లు,నుంచుంటే తన్ను,ఏడుపెంకులు ఆట,పప్పుచారు ఆట,ఉడుం ఆట ఆడేవాళ్ళము. ఈప్రాంతానికి 1970 లలోనే క్రికెట్ ఆటను పరిచయము చేసి టోర్నమెంట్స్ నిర్వహించినది మనగ్రామము. భారతదేశమునకు వాలీబాల్ కోచ్,ధ్రోనాచార్య అవార్డ గ్రహీత రమణరావు గారిని, National volleyball Team Captain గా పనిచేసిన జాగర్లమూడి సింగారావు గారిని అందించిన ఘనత వహించెను.
welcome 2 MAA BADI
-----------------
The name says wat v are
Our village is sweet memory in our school days, Now Every one has their own responsibility to enhance its allround development. Try to serve for our FUTURE GENERATIONS. Are you sure to join with us?
Wellcome ....to Build a new culture and promote valueble service with us
visit www.abbineniguntapalem.com
u can express ur regrets or ur appreciation(!!!!)for the institution or share ur experiences,come join this one for sure
lets c how many are Maabadians!!!!!!