వెబ్ సైట్ అబ్బినేనీగుంటపాలెం గ్రామ ప్రజల కొరకు మరియు భవిష్యత్ తరాల కు విషయాన్ని 

అందించుట కొరకు నిర్మించినాము.మన గ్రామం జీవనాధారం వ్యవసాయము,రైతు లేనిదే రాజ్యం 

లేదు,అందుకే రైతే రాజు అన్నారు.దేశానికి వెన్నెముక రైతు,దేశ ప్రజలందరికీ పట్టేడన్నం పెట్టేది 

అన్నదాత,అట్టి రైతులు జీవితాలు ఈనాడు కడు దయనీయమయినాయి.రైతులు ఆత్మహత్యల 

పరంపర ఇంకా కొనసాగుతున్నది. అట్టి రైతుబిడ్డలకు దిక్కేది మరి ?


అందుకే  వెబ్ సైట్ ద్వారా వారి కష్టాలను గుర్తించి,రైతు బిడ్డలకు అవసరమైన మౌలిక 

సదుపాయలను కలిపించుటకు, దేశ,విదేశాలలోని మన గ్రామస్తుల సహాయ సహకారాలను 

తీసుకొనివారిని పైకి తీసుకురావాలని దుద్దేశముతో నిర్మించితిమి. వెబ్ సైట్  వారి శ్రమకు 

తగిన బహుమతి కాకున్నాను,మీ వెనుక మేమున్నాము అనే ధైర్యాన్నీ నింపుటకును,

మా శక్తి కొలది గా చేసిన  ప్రయత్నాన్ని అన్యధా బావించక, మా చిరు కానుక గా స్వీకరిస్తారని భావిస్తూ.........
నా మాతృభూమి రైతు బిడ్డలకు అంకితము ఇస్తున్నాను.

                                                     ఇట్లు
                                                                          మీ భవధీయుడు

                                                                    వేజండ్ల వెంకట సుబ్బారావు USA 

 

Welcome to the A.B.Palem

Welcome to the Abbineniguntapalem Village Website.This web site is intended to link together the people who belong to our home village ABPalem and living else where.This site is not meant for any commerical purpose.You might want to know what is happening in your home village.you might be wondering what your childhood friends are doing now.How Successful are they in their lifes?.This site is not for those trivial reasons. We spent our childhood there, leading some successful life some where else..,Let us try to do something back to our home village.

Quick Note:
This site development is still in progress, thanks for visiting please find more information on your next visit.

 

 Abbineni gunta Palem Simply known as A.B.Palem is a very prosperous model village located 20 km from the busy commercial City of Guntur in Guntur district in Andhra Pradesh,India.AbbineniguntaPalem Village covers an area of 7.8 sq. km.,and has a population of 3,500 as of 2006. The AbbineniguntaPalem village boundary of the Guntur district,The Village is bounded on the Northeast by the G.G.Palem,on the East by the RaviPadu village,on the south by Varagani and Pedanandipadu Villages,on the west by Kopparthi and Ganikapudi Villages,on the North by Prathi padu and on the northwest by Peda Gottipadu Village.

Cotten and Chillies are the main agricultural products cultivated in the Village.

Some places of historical importance in AbbineniguntaPalem Village are Temples and Schools.  

A BRIEF HISTORY OF ABPALEM:


   మా గ్రామము అబ్బినేనీగుంటపాలెం గుంటూరు జిల్లా లో పెదనందిపాడు మండలం లో ఉన్నది. గుంటూరు నుండి పెదనందిపాడు వెళ్లే మార్గం లో 20 కి.మీ వద్ద ఉన్నది. ప్రత్తిపాడు దాటిన తర్వాత 5 కి.మీ దూరం లోనే ఉన్నది. దీనినే పాత మద్రాస్ రోడ్డు అంటారు దీని మీదుగా మహాత్మా గాంధీ తాత 1921 లో పెదనందిపాడు మీదుగా,చీరాల నడిచివెళ్లిరి. రోడ్డు బారున ఇరువైపులా పెద్ద పెద్ద చింత చెట్లు బాటసారులకు చల్లని నిడతో స్వాగతం పలుకుతాయి.పచ్చని పంట పొలాలు,నల్లరేగడి భూమి మా ఊరు సొంతము.ప్రత్తి,మిర్చి,సొయాచిక్కుడు,మినుము,శెనగ జొన్న,మొక్కజొన్న,కంది లాంటిపంటలు పండుతావి, నిజం చెప్పాలంటే గ్రామంలో పశువులు పాడి తక్కువ. బస్సు దిగాంగానే ఒకవైపు 1950 లో మాకినేని రామయ్య గారు స్తాపించిన స్కూలు,మరో వైపు గ్రౌండ్, దాని ప్రక్క గా, గ్రామమ లో కి వెళ్లు మైన్‌రోడు, అన్ని రోడ్డులు చాలా పద్ధతి గా ఉండును. ప్రధాన కూడలిలో లైబ్రరీ, వేణు గోపాలస్వామి గుడి ఉండును. మా గ్రామంలో పెద్ద చెరువు చాలా పెద్దది, మరియు చెరువు గట్టు మీద పోలేరమ్మ గుడి,నడిదిబ్బ, పిల్లల ప్లే గ్రౌండ్, రోమన్ కథలిక్ చర్చి, అవ్వాగారి మఠం, రైసుమీళ్ళు, బియ్యం చెరువు కట్టా, చిన్న చపాత, కాలువ,కాలవ డామ్ మైక్రోటవేర్, చిన్న చెరువు, లైబ్రరీ, రోడ్డు మీద బస్ షెల్టేర్,హైస్కూలు చాలా ఆహ్లాదము గా ఉండు ప్రదేశాలు ఇవి కాక గుడి సెంటెర్,సుబ్బారావు ఢాబా,నేరేడు చెట్టు సెంటెర్,హై స్కూలు గోడ ప్రక్కనే అరుగు,మల్లేశ్వరరావు హోటలు,యస్ టి డి బూత్,పేరయ్య గారి బండ్ల మీద,వోవయ్య గారి ఆరుగు,లాంటివి ప్రధాన రచ్చబండ సెంటెర్లు, గ్రామస్తులు కాలక్షేపము చేయు ప్రదేశములు కూడా అవే. దాదాపు 200 సం క్రితము మా పూర్వీకులు ప్రకాశం జిల్లా లోని సింగారాయికొండ పరిసర ప్రాంతాలైన పొందూరు,చిలకపాడు నుండి వ్యవసాయం నిమిత్తము వలస వచ్చారు. మొదట పాత చెరువు దగ్గరగా నివాసాలను ఏర్పాటు చేసుకొన్నారు, అక్కడ దొంగలు భయం వలన, గొరిజవోలుగుంటపాలెం లో రాజుల సహకారం తీసుకొని ఇప్పుడున్న గ్రామమును నిర్మించినారు. గ్రామం లో ప్రధానంగా కమ్మ వారు పెద్ద కులము,మరియు ఇతర కులాలు తెలగా, రెడ్డి, సాకలి, మంగలీ, కంసాలి, బ్రాహ్మణ, పద్మసాలి, సాహేబులు, ఏనాధులు, మాల, మాధిగలు ఉన్నారు. ప్రధాన కులమైన కమ్మ వారిలో మాకినేని వారు, మధమంచి వారు, వేజండ్ల వారు, పెద్ది వారు, కొల్లి వారు, కుర్రావారు,మద్దినేని వారు,మేడుకొండూరి వారు,మారెళ్ల వారు,మన్నవ వారు, సొమ్మెపల్లి వారు, పిన్నీంటి వారు, రావి వారు, రావిపాటి వారు,జాగర్లమూడి వారు, చిమటా వారు,చెరుకూరి వారు,సయిoపు వారు, గడ్డిపాటి వారు ఇంటి పేర్లుగా కలిగి ఉన్నారు.             
 
రాజకీయ ఉన్నతి:
                    ఇప్పటి వరుకు ఈ గ్రామానికి పంచాయతీ సర్పంచులుగా
 శ్రీ మాకినేని రామయ్య గారుశ్రీ మాకినేని అంకమ్మ గారు, శ్రీ మధమంచి ఓవయ్య గారు,శ్రీ మాకినేని సాంబశివరావు గారు,శ్రీ వేజండ్ల రామారావు 
గారు,శ్రీ మాకినేని వెంకటేశ్వర్లు భూమతగారు,శ్రీ చిమటా నారాయణ గారు 
పని చేసినారు.వీరందరి కృషి తో గ్రామము అభివృద్ది పదంలోకి నడిపించబడినది. 
                            

 డా.మాకినేని పెదరత్తయ్య గారు ప్రత్తిపాడు నియోజకవారానికి 22 సం ఎంల్ ఏ గా తెలుగుదేశం పార్టీ తరుపున వరుసగా 5పర్యాయములు ఎన్నికై రికార్డు సృష్టించినారు.

నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచి,నిర్మమొహమాటము తో,
ముక్కుసూటితనము తో రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పి
అన్న నందమూరి తారక రామారావు ప్రేమకు నొచుకొనెను , జిల్లా TDP   అధ్యక్షులుగాను, నీటి పారుదల శాకా మంత్రిగాను, State TDP Secretary గాను పనిచేసినారు.అన్న రామారావు గారి  కడదా వారి  అడుగుజాడలలోనే నడిచినారు.
 
             రావి వెంకట రమణ 2004 ఎలక్షన్ లో ఎంల్ ఏ గా కాంగ్రెసు పార్టీ తరుపున ఎన్నకైనారు.యువకుడైన రమణ ప్రత్తిపాడు నియోజక వర్గానికి 
అతి చిన్నవయసు 36సం|| లోనే M.L.Aఎన్నికై,గుంటూరు జిల్లాలో 
తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నాడు.
 
అబ్బినేనీగుంటపాలెం  గ్రామము  ప్రత్తిపాడు నియోజకవర్గనీ కి దాదాపు 30 సం! నాయకత్వాన్ని అందించి ఘనత వహించెను.
 

   Temples

  • Veenu Gopala swamy Temple
  • Saibaba Temple
  • Poleramma Temple
  • Avva gari Matham
  • Roman Cacholic Church

 Please feel free to contact us subbarao@abbineniguntapalem.com

 

  

TV Channels Live

TV9

TV5

DD8

Samskruthi

Mana TV

NASA TV

BBC NEWS

 

Live Radio

Aakaashavaani Radio

Radio

 

 vamsavruksham