వంశ వృక్షము
 మా పూర్వీకులు: దాదాపు 200 సం క్రితము మా పూర్వీకులు ప్రకాశం జిల్లా లోని సింగారాయికొండ పరిసర ప్రాంతాలైన పొందూరు,చిలకపాడు నుండి వ్యవసాయం నిమిత్తము వలస వచ్చారు. మొదట పాత చెరువు దగ్గరగా నివాశాలను ఏర్పాటు చేసుకొన్నారు, అక్కడ దొంగలు భయం వలన, గొరిజా వోలు గుంటపాలెం లో రాజుల సహకారం తీసుకొని ఇప్పుడున్న గ్రామమును నిర్మించినారు. గ్రామం లో ప్రధానంగా కమ్మ వారు పెద్ద కులము,మరియు ఇతర కులాలు తేలగా, రెడ్డి, సాకలి, మంగలీ, కంసాలి, బ్రహ్మణ, పద్మసాలి, సాహేబులు, ఏనాధులు, మాల, మాధిగలు ఉన్నారు. ప్రధాన కులమైన కమ్మ వారిలో మాకినేని వారు, మధమంచి వారు, వేజండ్ల వారు, పెద్ది వారు, కొల్లి వారు, కుర్రా వారు, సొమ్మెపల్లి వారు, పిన్నీంటి వారు, రావి వారు, రావిపాటి వారు, గడ్డిపాటి వారు ఇంటి పేర్లుగా కలిగి ఉన్నారు. ఇప్పటికీ మా వేజండ్ల వారు అక్కడ సింగారాయికొండ పరిసర ప్రాంతాలైన పొందూరు,చిలకపాడు చాలా గ్రామాలలో ఉన్నారు మా కుల దేవత( దేవరి) ఉన్నదిని చెప్పుతారు.ఉత్సవాలు జారుకుతావి అని పెద్దలు చెప్పుతారు.మా గురువు గారు ఏడాదికి ఒకసారి ఇక్కడికి వచ్చేవారు గతంలో, కానీ ఆచారాలు కనుమరుగు అవటం చేత, ఆధరించేవారు కరువగుట వలన, వారు రావటం లేదు.